* పార్టీశ్రేణులకు మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి దిశానిర్దేశం
ఆకేరు న్యూస్, కరీంనగర్: పంచాయతీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పార్టీశ్రేణులకు పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలో శుక్రవారం నిర్వహించిన పార్టీ ముఖ్యనాయకులతో సమావేశం నిర్వహించి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రచార కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల గురించి ప్రజలకు వివరించడం వంటి తదితర అంశాలపై ఆయన దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పని చేస్తే గెలుపు సాధ్యమన్నారు.పట్టింపులకు పోకుండా పంచాయతీల్లో పట్టు సాధించడంపైననే దృష్టి సారించడమే కాకుండా ఆ దిశగా కృషి చేయాలని ఆయన కోరారు. పార్టీ కోసం కష్టపడి పని చేసే నాయకులకు,కార్యకర్తలకు గుర్తింపు లభిస్తుందన్నారు. ప్రభుత్వ పథకాల గురించి, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల గురించి ఇంటింటా విస్తృతంగా ప్రచారం చేయాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుధగోని లక్ష్మినారాయణ గౌడ్, తిమ్మాపూర్, గన్నేరవరం మండల పార్టీ అధ్యక్షులు బండారి రమేశ్, ముస్కు ఉపేందర్ రెడ్డి, పార్టీ నాయకులు మోరపల్లి రమణారెడ్డి, తుమ్మనపల్లి శ్రీనివాసరావు, శ్రీగిరి రంగారావు, గోపు మల్లారెడ్డి, శ్రీనాథ్ రెడ్డి, మామిడి అనిల్ కుమార్, ఎస్.కొండల్ రావు, కొత్త తిరుపతిరెడ్డి, గోగూరి నర్సింహారెడ్డి, పోలు రాము,రమేశ్, మాతంగి అనిల్, బొడ్డు సునిల్, రవీందర్ రావు, శ్రీధర్ రెడ్డి, ముద్దసాని శ్రీనివాస్ రెడ్డి, నాగిశెట్టి రాజయ్య, దూలం వీరస్వామి గౌడ్, ఒడ్నాల నర్సయ్య, కె.రాంప్రసాద్,బుర్ర శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
……………………………………………..
