* సత్యసాయి జయంతి వేడుకల్లో ప్రధాని మోదీ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : భగవాన్ సత్య సాయి తన జీవిత కాలం ప్రేమ శాంతి కోసం మే పరితపించారని ప్రధాని మోదీ అన్నారు. సత్యసాయి శత జయంతి వేడుకలు పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో బ్రహ్మాండంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. విశ్వమానవ సేవకు తన జీవితాన్ని బాబా అంకితం చేశారని మోదీ అన్నారు. వసుధైక కుటుంబాన్ని బాబా ప్రేమించారని అన్నారు. గుజరాత్ లో భూ కంపం వచ్చినప్పడు సత్యసాయి అందించిన సహకారం మరువలేనిదని అన్నారు. సత్యసాయి జయంతి వేడుకల్లో పాల్గొనడం తనకు ఆనందంగా ఉందన్నారు. తాగునీరు, వైద్యం, విద్య వంటి రంగాల్లో విశిష్ట సేవలందించారనిపేర్కొన్నారు. అనంతరం బాబా స్మారక నాణేన్ని ప్రధాని మోదీ విడుదల చేశారు. అంతకు ముందు మోదీ బాబా మహా సమాధిని దర్శించారు.
……………………………………………………….
