
– పాకిస్తానీలను వెనక్కి పంపాలని ఎమ్మార్వో కి వినతి పత్రం అందించిన బిజెపి శ్రేణులు
ఆకేరు న్యూస్, కమలాపూర్: పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పాకిస్తాన్లోని తొమ్మిది చోట్ల ఆపరేషన్ సిందూర్ తో చేపట్టిన సైనిక చర్య విజయవంతమైన సందర్భంగా కమలాపూర్ మండలంలోని శ్రీరామాలయంలో బుధవారం బిజెపి శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.రాబోయే యుద్ధంలో భారత సైన్యం పూర్తి శక్తి, సామర్థ్యాలను ప్రదర్శించి ఉగ్రవాదంపై విజయం సాధించాలని ప్రార్థనలు చేశారు. అనంతరం అక్రమంగా నివసిస్తు, వీసా గడువు ముగిసిన పాకిస్తానీలని వెంటనే గుర్తించి, వెనక్కి పంపించాలని స్థానిక ఎమ్మార్వో కి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా బిజెపి మండల అధ్యక్షుడు ర్యాకం శ్రీనివాస్ మాట్లాడుతూ…పాకిస్తానీలను వెనక్కి పంపడంలో కాంగ్రెస్ గవర్నమెంట్ విఫలమైందని అన్నారు.వెంటనే రాష్ట్రంలో ఉన్న పాకిస్తానీలను వారి దేశానికి పంపేలా చర్యలు చేపట్టాలని అన్నారు.
కార్యక్రమంలో జిల్లా నాయకులు తుమ్మ శోభన్ బాబు, కనుకుంట్ల అరవింద్,భూపతి ప్రవీణ్,ఇనుగాల రత్నాకర్, మౌటం రమేష్ బాబు, శ్రీనివాస్, గొర్రె మధుసూదన్ రెడ్డి, కొలను రాములు, మౌటం అశోక్, మండ అశోక్, పాక కుమారస్వామి,తూర్పటి భాస్కర్,కటమాండు రాజేశ్వర్ రావు, ఆముదాపురం రామారావు, మౌటం జై శంకర్, వరికొలు రాజేందర్,నాసాని రాజు, గుర్రం సురేష్,మేడిపల్లి రాజు, పుస్కూరి రాంబాబు,చిట్టీ సుందరయ్య,దండబోయిన శ్రీనివాస్, పోతిరెడ్డి శంకర్,మేకల ఓదెలు, పిసాల రవీందర్, శనిగరం సంపత్, చందర్ సింగ్,జెర్రి పోతుల రవి, గోల్కొండ బిక్షపతి,రావుల ఆకాష్,పుల్లా సంజీవ్, శనిగరపు ఆనందం, ఒస్కుల రత్నం తదితరులు పాల్గొన్నారు.
………………………………………..