Yadagirigutta
* కారు ఢీకొని యాచకురాలు మృతి
ఆకేరు న్యూస్, యాదాద్రి భువనగిరి జిల్లా : యాదగిరిగుట్ట కొండపై విషాద ఘటన చోటుచేసుకుంది. కొండపై కొన్ని సంవత్సరాలుగా యాచకురాలిగా జీవిస్తున్న ఓ మహిళను కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. TS 32 F 1999 నంబర్ గల కారు అజాగ్రత్తగా, అతివేగంగా రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
కొండపైకి వచ్చిన అనంతరం సాధారణంగా వాహనాలను పార్కింగ్ ప్రదేశంలో నిలిపివేయాల్సి ఉండగా.. కారు శివాలయం సమీపం వరకు వెళ్లి అక్కడ పార్క్ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
శివాలయం వరకు వాహనాలను అనుమతించడంపై అధికారులు ఆరా తీస్తున్నారు. అసలు అక్కడి వరకు కారు వెళ్లేందుకు, పార్కింగ్ చేసేందుకు అనుమతి ఎవరు ఇచ్చారనే దానిపై విచారణ చేపట్టినట్లు సమాచారం. శివాలయం వరకు వాహనం వెళ్లకుండా ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, కారు డ్రైవర్ నిర్లక్ష్యంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
