Toxic Advance Bookings Yash
ఆకేరున్యూస్, హైదరాబాద్ :
యష్ నటించిన ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాకు గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఆగస్టు 26న థియేటర్లలో విడుదల కానుంది. యాక్షన్, క్రైమ్, పీరియడ్ డ్రామా అంశాల మేళవింపుతో ఈ చిత్రంపై ఇప్పటికే భారీగా ఆసక్తి నెలకొంది.
* రూ.24 కోట్లను దాటిన అడ్వాన్స్ బుకింగ్
‘టాక్సిక్’ ఇప్పటివరకు భారత్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ లో రూ.24.27 కోట్లు వసూలు చేసింది. 14,104 షోలకు 6,39,966 టికెట్లు అమ్ముడయ్యాయి. ఆసక్తికరంగా, గ్రాస్ వసూళ్ల విషయంలో కన్నడ, హిందీ మార్కెట్లు దాదాపు సమానంగా ఉన్నాయి. హిందీ 2డీ వెర్షన్ రూ.11.06 కోట్ల వసూళ్లతో ఈ జాబితాలో అత్యధికంగా కంట్రిబ్యూట్ చేసింది. ఆ తర్వాత కన్నడ 2డీ వెర్షన్ రూ.10.99 కోట్లతో ఉంది. ప్రీమియం ఫార్మాట్లు కూడా మొత్తం వసూళ్లకు తమ వంతు సహకారం అందిస్తున్నాయి. హిందీ ఐ మ్యాక్స్ 2డీ ద్వారా రూ.28.57 లక్షలు, హిందీ 4 డీఎక్స్ ద్వారా రూ.22.17 లక్షలు వచ్చాయి. ఇక కన్నడలో ఐ మ్యాక్స్ 2డీరూ.71.28 లక్షలు, 4డీఎక్స్ రూ.21.45 లక్షలు వసూలు చేసింది.
* ఇతర భాషల్లోనూ
తమిళ 2డీ వెర్షన్ రూ.44.85 లక్షలు, మలయాళం 2డీ రూ.19.11 లక్షలు, తెలుగు 2డీరూ.13.38 లక్షలు నమోదు చేశాయి. హిందీ డాల్బీ సినీ ద్వారా రూ.64,700 వసూలయ్యాయి. బ్లాక్ చేసిన సీట్లను కూడా కలుపుకుంటే సినిమా గ్రాస్ వసూళ్లు రూ.32.85 కోట్లకు చేరుకున్నాయని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
* నటీనటుడు
‘టాక్సిక్’లో యష్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, కియారా అద్వానీ, నయనతార, హ్యూమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
