* ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి వర్సెస్ ఆరెకపూడి గాంధీ
* తేల్చుకుందాం రా.. అంటూ సవాళ్లు.. ప్రతిసవాళ్లు
* కూకట్పల్లిలోని గాంధీ, కొండాపూర్లోని కౌశిక్ ఇళ్ల వద్ద భారీ భద్రత
* పార్టీని నాశనం చేస్తున్నారు
* ఇలాంటి వారి వల్లే కేసీఆర్కు ఎమ్మెల్యేలు దూరం అవుతున్నారు : గాంధీ
* మిస్టర్ గాంధీ గుర్తుపెట్టుకో.. నేను మగోణ్ని : కౌశిక్ రెడ్డి
* రేపు ఉదయం బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు గాంధీ ఇంటికెళ్తామని మరోసారి స్పష్టం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఎమ్మెల్యేలు ఆరెకపూడి గాంధీ(Arekapudi Gandhi), పాడి కౌశిక్ రెడ్డి(Padi Kousikreddy) మధ్య మాటల యుద్ధం ముదిరి పాకాన పడింది. మీ ఇంటికి వస్తే.. మీ ఇంటికి వస్తా.. అంటూ సవాళ్లు, ప్రతి సవాళ్లు చేసుకున్నారు. దమ్ముంటే రా తేల్చుకుందామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇద్దరి ఇళ్ల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌశిక్ రెడ్డిని గృహ నిర్భందం చేశారు. అసలు వివాదం ఎలా మొదలైందంటే.. ఆరెకపూడి గాంధీ ఇంటిపై బీఆర్ ఎస్(Brs) జెండా ఎగురవేస్తానని, ఈ రోజు ఉదయం 11 గంటలకు వెళ్తానని నిన్న కౌశిక్ రెడ్డి సవాల్ చేశారు. చేతగాకపోతే చీర, గాజులు వేసుకుని పబ్లిక్ లో తిరగాలని అన్నారు. తీవ్రస్థాయిలో ఆరెకపూడి గాంధీపై ధ్వజమెత్తారు. దీనిపై గాంధీ రియాక్ట్ అయ్యారు. గాంధీ అనే పేరును కాసేపు పక్కనబెట్టి తాడోపేడో తేల్చుకుంటానని అన్నారు. కౌశిక్ రాకపోతే 12 గంటలకు తానే అతడి ఇంటికి వెళ్తానని అన్నారు. పోలీసులు అడ్డగించినా, ఎవరు ఆపినా ఆగేది లేదని స్పష్టం చేశారు. కౌశిక్ రెడ్డి లాంటి బ్రోకర్ల(Brokers)తో బీఆర్ ఎస్ కు నష్టం అని, అలాంటి వారి వల్లే కేసీఆర్ కు ఎమ్మెల్యేలు దూరం అవుతున్నారని అన్నారు.
పక్కా సినిమా చూపిస్తా..
కౌశిక్ రెడ్డికి పక్కా సినిమా చూపిస్తానని గాంధీ హెచ్చరించారు. చీర, గాజులు చూపించి చేసిన కామెంట్లపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఒక దుర్మార్గుడితో తన ఇంటిపై జెండా ఎగరవేయించుకునే దుస్థితిలో తాను లేనన్నారు. నువ్వ్ మా ఇంటికి రాకపోతే నేనే మీ ఇంటికి వస్తానని అన్నారు. నీ దమ్ము ఏందో.. నా దమ్ము ఏందో తెలుసుకుందామన్నారు.
గాంధీకి ఎందుకంత భయం..
‘ నన్ను అరెస్ట్ చేసి గృహ నిర్బంధం చేశారు. గాంధీ గారు నేరుగా జవాబు ఇవ్వండి. నేను బీఆర్ ఎస్(Brs) లోనే ఉన్నారు అన్నారుగా.. అయితే నేను మీ సహచర ఎమ్మెల్యేను కదా.. మీ ఇంటికి వస్తానంటే ఎందుకు భయపడుతున్నారు. ఉదయం 5 గంటల నుంచే నా ఇంటి చూట్టూ.. పోలీసులు చుట్టారు. కంచె ఏర్పాటు చేశారు. బ్రోకర్ గాన్ని నేనా.. నువ్వా’ అని ప్రశ్నించారు. చంద్రబాబును, కేసీఆర్(Kcr) ను మోసం చేశావని అన్నారు. పూటకో పార్టీ మారినోడు బ్రోకరా, ఒక పార్టీపై గెలిచి ఒకే పార్టీలో ఉన్నవాడు బ్రోకరా అన్నారు. మిస్టర్ గాంధీ గుర్తుపెట్టుకో.. కేసీఆర్ నాయకత్వంలో, బీఆర్ ఎస్ జెండాతో ఈటల ను బొంద పెట్టి.. బీఆర్ఎస్ జెండా ఎగురవేసిన మగోన్ని తాను అన్నారు. రేపు ఉదయం 11 గంటలకు మేడ్చల్ జిల్లా బీఆర్ ఎస్ కార్యాలయం నుంచి నేతలు, కార్యకర్తలు మా ఎమ్మెల్యే(Gandhi) గాంధీ ఇంటికి వెళ్తాం.. అక్కడ బ్రేక్ ఫాస్ట్, లంచ్ అక్కడే చేస్తామని తెలిపారు. గొడవకు కాదని, తాము మా ఎమ్మెల్యే దగ్గరకు పోతామన్నారు. వేలాది మంది కార్యకర్తలు తరలిరావాలన్నారు. చీర, గాజులు సవాళ్ల సంస్కృతి మొదలుపెట్టింది రేవంత్ రెడ్డే అన్నారు. నాలుగేళ్ల తర్వాత అందరికీ సినిమా ఉంటుందన్నారు.
—————————————-