* సీఎం రేవంత్‌పై కేటీఆర్ ధ్వజం
ఆకేరున్యూస్, కరీంనగర్‌్: నీ దగ్గర అధికారం ఉండొచ్చు.. మా దగ్గర అభిమానం ఉందని సీఎం రేవంత్‌ను కేటీఆర్ విమర్శించారు. కరీంనగర్ జిల్లా అలుగునూరు చౌరస్తాలో శుక్రవారం నిర్వహించిన దీక్షా దివస్ కార్యక్రమానికి కేటీఆర్ హాజరై ప్రసంగించారు. రాష్ట్రంలోని పరిస్థితుల కారణంగా మరోసారి పోరాట బాట పట్టాల్సిన అవసరం ఉందన్నారు. కేసీఆర్ పదవులు ఆశించకుండా తెలంగాణ కోసం కృషి చేశారని తెలిపారు. కేసీఆర్ అనేది పేరు కాదు.. తెలంగాణ పోరు అన్నారు. కాంగ్రెస్ ఏడాది పాలనతో తెలంగాణలో ఏ ఒక్క వర్గం కూడా సంతోషంగా లేరని కేటీఆర్ అన్నారు. ఆఖరకు గురుకులాల్లో ఉండే పిల్లలు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. వచ్చే నాలుగేళ్లు ప్రజల పక్షాన ఉద్యమిద్దామని బీఆర్ఎస్ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
…………………………..