
* కుప్పకూలిన 30 ఏళ్ల యువకుడు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఎప్పుడు ఎవరికి ఏం జరుగుతుందో, ఎందుకు చనిపోతున్నారో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవలి కాలంలో ఆకస్మిక మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నిండా 30 ఏళ్లు కూడా ఉండని యువకులు కూడా గుండెపోటుతో చనిపోతుండడంతో కలకలం రేపుతోంది. తాజాగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం(Ibrahimpatnam_లో జరిగిన ఘటన తీవ్ర షాకింగ్ గా, విషాదంగా మారింది. జ్యూస్ తాగుతుండగానే ఓ యువకుడు కుప్పకూలి గుండెపోటుతో చనిపోయాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లా పల్లెపాడుకు చెందిన ఏకలవ్య (30) ఇబ్రహీంపట్నం మున్సిపల్ కేంద్రంలోని మిత్రుడితో కలిసి ఉంటున్నాడు. బుధవారం రాత్రి జ్యూస్ తాగేందుకు ఓ దుకాణానికి వెళ్లాడు. జ్యూస్ ఆర్డర్ ఇచ్చాడు. అక్కడే నిల్చొని జ్యూస్ తాగుతున్న ఏకలవ్య ఒక్కసారిగా కుప్ప కూలిపోయాడు. పైకి లేచేందుకు ఎంత ప్రయత్నించినా లేవలేకపోయేవాడు. ఇది గమనించిన స్థానికులు సీపీఆర్ (CPR) చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి తమ వాహనంలోనే అతడిని హాస్పిటల్కి తరలించారు. అప్పటికే ఏకలవ్య మృతిచెందిన చెందినట్లు వైద్యలు నిర్ధారించారు. మరోసారి యువ గుండె ఆకస్మికంగా ఆగిపోవడం కలకలం రేపుతోంది.