
– అటవీ శాఖకు అప్పగించిన కమలాపూర్ సీఐ హరికృష్ణ
ఆకేరు న్యూస్, కమలాపూర్ : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెం గ్రామ యువకులు సోమవారం జాతీయ పక్షి నెమలిని కాపాడి పోలీసులకు అప్పగించారు. కమలాపూర్ పోలీస్ ఇన్స్పెక్టర్ హరికృష్ణ తెలిపిన వివరాల ప్రకారం మర్రిపల్లిగూడెం గ్రామ యువకులు మధ్యాహ్నం పొలం దగ్గరికి వెళ్లి, వస్తుండగా.. రోడ్డు పక్కన పొదల్లో చిక్కకున్న జాతీయపక్షి నెమలిని గుర్తించారనీ సీఐ తెలిపారు. నెమలిని సురక్షితంగా కమలాపూర్ పోలీస్ స్టేషన్ కి తీసుకువచ్చి సమాచారం అందించటంతో నెమలిని కమలాపూర్ పరిధి అటవీ శాఖ అధికారులకు అప్పగించినట్లు సీఐ తెలిపారు.
………………………………………………..