Peddi Sudarshan Reddy Health
* పరిస్థితి విషమం
* హైదరాబాద్ నుంచి బయలుదేరిన కేటీఆర్, హారీష్ రావు
ఆకేరు న్యూస్ , వరంగల్ :
తెలంగాణ ఉద్యమ నేత , బీఆర్ ఎస్ నాయకుడు , నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు వచ్చింది..ఈ రోజు ఉదయం అనారోగ్యానికి గురి కావడంతో హుటాహుటిన ఆయనను రోహిణి ఆసుపత్రికి తరలించారు.. గుండెపోటుగా గుర్తించిన వైద్యులు చికిత్స అందిస్తున్నారు..
సీపీఆర్ చేస్తున్నప్పటికీ స్పందించడం లేదంటున్నారు.. పెద్ది సుదర్శన్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.. సమాచారం అందుకున్న బీఆర్ ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావులు హైదరాబాద్ నుంచి బయలు దేరి వరంగల్ కు వస్తున్నారు..
