Rahul Gandhi Student Protest
అకేరు న్యూస్ ఢిల్లీ: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ స్పందించారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉద్యమించిన విద్యార్థులకు హ్యాట్సాఫ్ చెబుతూ, వారే నిజమైన దేశభక్తులని కొనియాడారు. విద్యార్థులు తమ హక్కుల కోసం, పారదర్శకమైన విద్యా వ్యవస్థ కోసం చేసిన పోరాటం దేశ ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనమని రాహుల్ అన్నారు.విద్యా రంగంలో సంస్కరణలకు దారి తీస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘విద్యార్థులపై ఎవరైతే దాడి చేసి, వారిని కొట్టి, వారిపై కాల్పులు జరిపారో, వారందరికీ శిక్ష పడాల్సిందే. ఈ విషయాన్ని ప్రభుత్వానికి మరోసారి గుర్తు చేస్తున్నాను’ అని రాహుల్ పేర్కొన్నారు. అలాగే, దేశ విద్యార్థుల గౌరవం, వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని భారత ప్రధానమంత్రి దాడులకు గురైన విద్యార్థులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
