Mahabubabad Collector Sneha Shabarish Crop Diversification
* పంట మార్పిడిపై రైతులకు దిశానిర్దేశం చేసిస్నేహ శబరీష్..
ఆకేరు న్యూస్ , మహబూబాబాద్: రైతులతో కలిసి జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ విత్తనాలు వేశారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎడ్జెర్ల గ్రామానికి చెందిన గిరిజన రైతు బాదావత్ వీరన్న – బుజ్జి దంపతుల వ్యవసాయ క్షేత్రంలో పంట మార్పిడి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె స్వయంగా పొలంలోకి దిగి పెసర విత్తనాలు వేసి పంట మార్పిడి విధానాన్ని ఆచరణలో చేసి చూపించారు.
* ఎల్నినోతో ముందస్తు జాగ్రత్త
ఈ ఏడాది సూపర్ ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉందని, కాబట్టి రైతులు పంటల ఎంపికలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని స్నేహ శబరీష్ సూచించారు. వరి వంటి అధిక నీటి అవసరమయ్యే పంటలకు బదులుగా, పప్పు దినుసులు మరియు కూరగాయల పంటలను సాగు చేయడం వల్ల తక్కువ నీటితోనే మెరుగైన దిగుబడులు సాధించవచ్చని వివరించారు. ప్రభుత్వం పంట మార్పిడి కోసం అందిస్తున్న సబ్సిడీ విత్తనాలు, ఇతర ప్రోత్సాహకాల గురించి రైతులకు అవగాహన కల్పించి, అనంతరం సబ్సిడీ విత్తనాలను పంపిణీ చేశారు.
వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను సాగు చేసి ఆర్థిక నష్టాలను తగ్గించుకోవాలని కలెక్టర్ రైతులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు మరియు పెద్ద సంఖ్యలో స్థానిక రైతులు పాల్గొన్నారు.
———————
Please tell us what is wrong. Your report will be sent to the website team.
