మేడారం జాతరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..
ఆకేరు న్యూస్ :
మేడారం: తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన సమ్మక్క-సారలమ్మ మహా జాతర వైభవంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈరోజు (గురువారం) మధ్యాహ్నం 2:00 గంటలకు మేడారం చేరుకోనున్నారు. డిప్యూటీ సీఎం పర్యటనకు సంబంధించి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.హెలికాప్టర్ ద్వారా మేడారం చేరుకుంటారు.గద్దెలపై కొలువుదీరిన ఆదివాసీ దేవతలు సమ్మక్క, సారలమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, జాతర ఏర్పాట్లపై స్థానిక ప్రజాప్రతినిధులు మరియు అధికారులతో క్షేత్రస్థాయిలో చర్చించే అవకాశం ఉంది.బుధవారం రాత్రి కన్నెపల్లి నుంచి సారలమ్మ గద్దెపైకి చేరుకోవడంతో జాతర అసలు ఘట్టం మొదలైంది. ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి రాక ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తుండగా, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా రవాణా, తాగునీరు, మరియు పారిశుధ్యంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
