అంబులెన్స్ వాహనాన్ని తనిఖీ చేస్తున్న 108 ఉమ్మడి వరంగల్ ప్రోగ్రాం మేనేజర్ పాటి శివకుమార్
ఆకేరు న్యూస్ , కమలాపూర్ : కమలాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన 108 అంబులెన్స్ వాహనాన్ని శుక్రవారం ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ పాటి శివకుమార్, హనుమకొండ జిల్లా మేనేజర్ లక్ష్మణ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సంబంధిత రికార్డులను తనిఖీ చేసి, ఎటువంటి రిమార్క్ లేకుండా వ్యవహరించాలి అని తెలియజేశారు. 108,102 వాహనాల పరికరాలను పరిశీలించారు. అధునాతన టెక్నాలజీ సహాయంతో ఫోన్ కాల్ వచ్చిన వెంటనే స్పందించి, సంఘటన జరిగిన స్థలానికి వీలైనంత త్వరగా చేరుకొని, వారికి ప్రథమ చికిత్స చేస్తూ దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్ కి చేర్చాలని తగిన సూచనలు చేశారు. కార్యక్రమంలో ఈఎంటీ శ్రీనివాస్, పైలట్ కుమారస్వామి పాల్గొన్నారు.
…………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
