Published:
Updated: 28 Sep 2024 • 08:42 AM
ఆకేరు న్యూస్, హైదరాబాద్: వరంగల్ భద్రకాళి శరన్నవరాత్రి ఉత్సవాలకు హాజరుకావాలని సీఎం రేవంత్‌రెడ్డికి ఆహ్వానం అందజేశారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వరంగల్ శ్రీ భద్రకాళీ దేవస్థానం చైర్మన్ శేషు, ఈవో శేషుభారతి, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కలిశారు. ఉత్సవాలను ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తారు. కావునా ఉత్సవాలకు సర్వం సిద్దం చేశారు. ఈక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భద్రకాళీదేవి శరన్నవరాత్రి మహోత్సవ ఆహ్వానాన్ని అందజేసి ఉత్సవాలకు రావాలని ఆహ్వానించారు.
……………………………
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
