ఆకేరు న్యూస్ డెస్క్ : ఇండోనేషియా (Indonesia )లో అక్రమంగా నిర్వహిస్తున్న బంగారు గని (Gold Mine) లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో సుమారు 11 మంది మృతి చెందారు. పలువురు గల్లంతయ్యారు. అక్కడి మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇండోనేషియా సులవేసి ద్వీపంలో (Sulawesi Island) కొందరు అక్రమంగా బంగారు గనిని నిర్వహిస్తున్నారు. సుమారు 35 మంది గ్రామస్థులు బంగారు గనిలో పనులు చేస్తున్నారు. ఆ సమయంలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు ఒక్కసారిగా విరిగి గనిలో పనిచేస్తున్న వారిపై పడ్డాయి. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయినట్లు గోరంటాలో సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ ప్రతినిధి అఫిఫుద్దీన్ ఇలాహుడే తెలిపారు. మొత్తం 11 మంది మృతదేహాలను సోమవారం గని నుంచి వెలికితీసినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో సుమారు 19 మంది గల్లంతయ్యారని.. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
——————————