* బైకును తప్పించబోయిన ఘటనలో ప్రమాదం
ఆకేరున్యూస్, మహారాష్ట్ర : మహారాష్ట్రలో బైకును తప్పించబోయి అదుపుతప్పిన బస్సు బోల్తా పడిన ప్రమాదంలో 11 మంది మృతిచెందారు. పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. గోండియా జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. భండారి నుంచి గోండియా వెళ్తున్న బస్సుకు కోప్ామారా హైవేపై ఓ బైక్ ఎదురొచ్చింది. ఆ బైకును తప్పించే క్రమంలో డ్రైవర్ దాన్ని మరోవైపునకు తిప్పడంతో బస్సు బోల్తా పడిరదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. బోస్సు బోల్తా పడిన తర్వాత డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
………………………………………….