* బోలే బాబా సత్సంగ్ లో మరణ మృదంగం
* ఎటు చూసిన మృత దేహాలే..
ఆకేరు న్యూస్, ప్రత్యేక ప్రతినిధి : ఘోరం జరిగింది. భక్తి పారవశ్యంతో ఊగిపోతున్న ఆ ప్రాంతం ఒక్కసారిగా మరు భూమిగా మారింది. ఏం జరుగుతుందో తెలియని పరిస్థితిలో ప్రాణాలు గాలిలో కలిసాయి. ఉత్తర ప్రదేశ్ లోని హథ్రస్ (Hathras) జిల్లా పుల్ రయీ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది . స్థానికంగా చాలా పేరున్న బోలే బాబా(Bhole Baba) దర్శనం కోసం జనం (Uttar Pradesh) ఎగబడ్డారు. ఆయన పాద ధూళి కోసం అందరూ ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో 116 మంది దుర్మరణం పాలయ్యారు. ఇందులో ఎక్కువ శాతం మహిళలే ఉన్నారు. కొద్ది మంది పిల్లలు ఉన్నారు. వందలాది మంది గాయపడ్డారు. సికందరరావు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫుల్రాయ్ గ్రామంలో భోలే బాబా సత్సంగ్ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. అనూహ్యంగా తొక్కిసలాట జరగడం కలకలం రేపింది. సమాచారం అందుకున్న సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని.. సహాయక చర్యలను వేగవంతం చేశారు. అప్పటికే 116 మంది మృతి చెందారు. వంద మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను పోలీసులు సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు.
దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం యోగి
పెను విషాదంపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యానాధ్ (Yogi Adityanath)సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. సహాయ చర్యలు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
———————————————