* 18వ లోక్సభ సమావేశాలు ప్రారంభం
* మోదీతో ప్రారంభమైన ప్రమాణ స్వీకారాలు
* తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన కిషన్రెడ్డి, రామ్మోహన్రాయుడు
ఆకేరు న్యూస్ డెస్క్ : మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం ప్రారంభమైన 18 వ పార్లమెంట్ (Parliament) తొలి సమావేశాల్లో తొలుత ప్రధాని(Prime Minister) తర్వాత కేంద్రమంత్రులు (Union Ministers) ప్రమాణ స్వీకారం (Take oath) చేశారు. ప్రొటెం స్పీకర్ భర్తృహరి మెహతాబ్ (Protem Speaker Bhartrihari Mehtab) సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రధాని తర్వాత సీనియారిటీ ఆధారంగా రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh), అమిత్ షా (Amit Shah), నితిన్ గడ్కరీ (Nitin Gadkari), శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh Chauhan), ఆపై మనోహర్ లాల్ (Manohar Lal) ప్రమాణ స్వీకారం చేశారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి (Kishan Reddy), రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) తెలుగులో (Telugu) ప్రమాణం చేశారు. మొత్తం ఈ రోజు 280 మంది ఎంపీ(MP)లు ప్రమాణం చేయనున్నారు. మిగిలిన వారితో మంగళవారం ప్రమాణస్వీకారం చేయిస్తారు. అనంతరం స్పీకర్ ఎన్నికకు నామినేషన్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. 26న స్పీకర్ ఎన్నిక పూర్తవుతుంది. తెలంగాణకు చెందిన ఎంపీల ప్రమాణ స్వీకారం రేపు జరగనుంది. 3 వ తేదీ వరకు పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి.
—————————