గోని దామోదర్ రెడ్డికి సాయం చేస్తున్న 1984–85 పదో తరగతి పూర్వ విద్యార్థులు
* ఆపదలో ఆపన్నహస్తంగా బాల్యమిత్రులు!
* నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఆత్మీయ అనుబంధం
* అనారోగ్యంతో కోమాలో ఉన్న మిత్రుడికి ఆర్థిక సాయం
ఆకేరు న్యూస్, పాలకుర్తి : నాలుగు దశాబ్దాల స్నేహబంధం.. ఆపదలో ఉన్న మిత్రుడికి అండగా నిలిచిన ఆత్మీయత.. నిజమైన స్నేహానికి నిలువెత్తు (Friendship Support )నిదర్శనంగా నిలిచారు 1984–85 పదో తరగతి పూర్వ విద్యార్థులు. చిన్ననాటి బడి జ్ఞాపకాల నుంచి జీవితపు మలిసంధ్య వరకు చెక్కుచెదరని అనుబంధాన్ని కొనసాగిస్తున్న ఈ మిత్రబృందం మానవత్వాన్ని చాటుకుంది.
* మిత్రుడి అనారోగ్యంతో చలించిన స్నేహితులు..
తమతో కలిసి చదువుకుని, ఎన్నో మధుర జ్ఞాపకాలను పంచుకున్న ప్రాణస్నేహితుడు గోని దామోదర్ రెడ్డి బ్రెయిన్ స్ట్రోక్ (Brain Stroke)కు గురై కోమాలో ఉన్నారన్న విషయం తెలుసుకున్న మిత్రులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.
వెంటనే ఆయనను పరామర్శించి, పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులకు అండగా నిలిచారు. ‘మేమున్నాం.. అధైర్యపడొద్దు’ అంటూ వారికి కొండంత ధైర్యాన్ని ఇచ్చారు. అంతేకాకుండా తమ వంతుగా ఆర్థిక సహాయం అందించి ఆపదలో ఆదుకోవడమే నిజమైన స్నేహమని నిరూపించారు.
* కష్టకాలంలో అండగా నిలిచిన మిత్రబృందం..
ఈ మానవతా కార్యక్రమంలో పాలకుర్తి తాజా మాజీ జెడ్పీటీసీ పుస్కూరి శ్రీనివాసరావుతో పాటు ఆయన బ్యాచ్‌కు చెందిన చిన్ననాటి మిత్రులందరూ పాల్గొన్నారు. దామోదర్ రెడ్డి కుటుంబానికి అండగా నిలిచి తమ స్నేహబంధంలోని గొప్పతనాన్ని చాటుకున్నారు.
సంపద ఉన్నప్పుడు అందరూ తోడుగా ఉంటారు. కానీ కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్లు తుడిచి, ధైర్యం చెప్పి భుజం తట్టేవాడే నిజమైన నేస్తం (Friendship Support). కాలం మారినా, దూరాలు పెరిగినా చెరిగిపోని ఈ స్నేహబంధం.. ఆపద సమయంలో ఒక్కటై నిలిచిన ఈ మిత్రుల మానవత్వం నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తోంది.
* మిత్రుడు త్వరగా కోలుకోవాలని ప్రార్థన..
తమ ఆత్మీయ మిత్రుడు గోని దామోదర్ రెడ్డి త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి తమ మధ్యకు రావాలని 1984–85 పదో తరగతి పూర్వ విద్యార్థుల స్నేహబృందం మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తోంది.
స్నేహానికి వయసు లేదు.. ఆత్మీయతకు అంతం లేదు.. అన్న మాటకు ఈ మిత్రబృందం నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.
Also Read : స్నేహ గ్రూప్‌పై రెండో రోజూ ఐటీ దాడులు

Please tell us what is wrong. Your report will be sent to the website team.

