
ఆకేరున్యూస్, మెదక్: బర్డ్‌ఫ్లూ వ్యాధి సోకి 3,500 నాటు కోళ్లు మృతి చెందాయి. ఈ ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం లింగాపూర్‌కు చెందిన నాటుకోళ్ల వ్యాపారి 3500 నాటుకోళ్లను పెంచగా.. బర్డ్ ఫ్లూ సోకడంతో అన్ని కోళ్లు మృతి చెందాయని ఆవేదన వ్యక్తం చేశారు. నాటు కోళ్ల పిల్లల పెంపకానికి 8 లక్షల వరకు వెచ్చించానని అవి చనిపోవడంతో తీవ్రంగా నష్టపోయానంటూ లబోదిపోమంటున్నాడు. బోర్లు సైతం వేయించానని, తన నాటు కోళ్ల ఫామ్ వద్ద పుష్కలంగా నీళ్లు, దాన ఉన్నాయని ఇంతకుముందు 5 సార్లు నాటు కోళ్లను పెంచి విక్రయించానని, ఎప్పుడు ఇలా జరగలేదని, కేవలం బర్డ్ ఫ్లూ వాళ్లనే తన నాటు కోళ్లు చనిపోయాయి అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని కోరాడు.
…………………………………….