PMAY Gramin 2.0
* బుర్రిపాలెంలో పీఎంఏవై గ్రామీణ్ 2.0
* 12 ఏళ్లలో 4 కోట్ల ఇళ్లు మోదీ ఘనత
* ఏపీ సీఎం చంద్రబాబునాయుడు
ఆకేరు న్యూస్, బుర్రిపాలెం : 3 డీ కాంక్రీట్ టెక్నాలజీతో ఏపీలో 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టినట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. పీఎంఏవై గ్రామీణ్ 2.0 కింద గుంటూరు జిల్లా బుర్రిపాలెం నుంచి ఏపీ వ్యాప్తంగా ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రానికి సాధారణ కోటాగా 75 వేల ఇళ్లు మాత్రమే మంజూరయ్యాయి. కానీ ప్రత్యేక విజ్ఞప్తి మేరకు 3 లక్షల ఇళ్లను కేంద్రం మంజూరు చేసిందని తెలిపారు. ఇవి పూర్తవ్వగానే మరో 3 లక్షల ఇళ్లను, వచ్చే ఏడాదిలో మరో 3 లక్షల ఇళ్లను ఇవ్వడానికి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అంగీకరించారుని వెల్లడించారు.
నాడు కృష్ణ.. నేడు పెమ్మసాని
బుర్రిపాలెం అనగానే సూపర్ స్టార్ కృష్ణ గుర్తుకు వస్తారని, ఇప్పుడు ఇదే గ్రామం నుంచి పొలిటికల్ హీరోగా పెమ్మసాని చంద్రశేఖర్ ఎదిగారని చంద్రబాబు కొనియాడారు. 3 లక్షల ఇళ్లలో 3 లక్షల కుటుంబాల జీవితాలను మార్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి వారికి భరోసా కల్పించామన్నారు. సొంత ఇంటితోనే జీవన ప్రమాణాలు, ఆత్మగౌరవం పెరుగుతుంది. పేదలకు సొంత ఇల్లు ఇవ్వాలన్న ఆలోచన చేసిందే ఎన్టీఆర్ అన్నారు. కూటమికి ప్రజలు వేసిన ఓటుతో సంక్షేమం, అభివృద్ధిని ప్రతి ఒక్కరికీ అందించేలా సుపరిపాలన అందిస్తున్నామని వెల్లడించారు.
రూ.52 వేల కోట్ల విలువైన స్థలాలు
పేదలకు పట్టాభిషేకం కింద ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల్ని పరిష్కరించి పేదలకు నివాస స్థలాలు ఇచ్చామని చంద్రబాబు వివరించారు. విశాఖ, విజయవాడ, మంగళగిరి సహా వివిధ ప్రాంతాల్లో రూ.52 వేల కోట్ల విలువైన స్థలాలను అందించామని తెలిపారు. ప్రతి వర్గానికీ, ప్రతి ప్రాంతానికీ అండగా నిలవడమే కూటమి ప్రభుత్వ అజెండా అన్నారు. 029 లోగా ఇళ్లులేని పేదలకు వంద శాతం ఇళ్లు కట్టించాలనే లక్ష్యంతో నిచేస్తున్నాం.
మధ్యప్రదేశ్ మామ శివరాజ్
మధ్యప్రదేశ్‌లో నర్మదా-క్షిప్రా నదులు, కెన్-బెత్వా, నర్మదా పార్వతీ నదులను శివరాజ్ సింగ్ చౌహాన్ అనుసంధానం చేశారని, నిరంతరం ప్రజలతో మమేకమై పనిచేసి మధ్యప్రదేశ్ ప్రజలందరి చేతా ఆయన మామ అని పిలిపించుకున్నారని బాబు తెలిపారు. 12 ఏళ్లలో 4 కోట్ల ఇళ్లను దేశవ్యాప్తంగా నిర్మించిన ఘనత ప్రధాని మోదీ దే అన్నారు. రూ.11,500 కోట్లతో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం పల్లె పండుగ కింద పనులు చేపట్టామన్నారు. వచ్చే ఐదేళ్లలో రూ.1.30 లక్షల కోట్లతో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేస్తామని పేర్కొన్నారు.
బుర్రిపాలెంలో పైలట్ ప్రాజెక్టు
3 డీ కాంక్రీట్ టెక్నాలజీతో పైలట్‌గా బుర్రిపాలెంలో ఇళ్ల నిర్మాణం చేయాలని నిర్ణయించామని చంద్రబాబు తెలిపారు. ఈ టెక్నాలజీతో నిర్మించిన ఇళ్లలో బయట వాతావరణంతో పోలిస్తే కనీసం 8 డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువ ఉంటుందని వివరించారు. గత ప్రభుత్వం ఇళ్ల నిర్మాణంలో అవినీతి అక్రమాలు చేసిందని, నివాసయోగ్యం లేకుండా చెరువుల్లో, గుట్టల్లో ఇంటి జాగా ఇచ్చేసి చేతులు దులిపేసుకుందని విమర్శించారు. ఇప్పుడు మళ్లీ పేదలకు పక్కా ఇళ్లను నిర్మించేలా ఈ కార్యక్రమం చేపట్టామన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
