
ఆకేరు న్యూస్, ములుగు : ములుగు జిల్లా లో4000 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉంది అని జిల్లా వ్యవసాయశాఖ అధికారి సురేష్ కుమార్ తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంతమంది ములుగు జిల్లాలో యూరియా అందుబాటులో లేదని వాట్సప్ గ్రూపులలో వదంతులు క్రియేట్ చేస్తున్నారని అటువంటి ఆరోపణలు మానుకోవాలని సూచించారు. ప్రస్తుతం యూరియా కావాల్సిన రైతులు సమీపంలోని ప్రాధమిక వ్యవసాయ సహాయ సహకార పరపతి సంఘం(పిఎసిఎస్), ఆగ్రోస్ మందులు డిలర్ కేంద్ర లలో యూరియాను కొనుగోలు చేయాలని తెలిపారు.ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
……………………………………………..