
* కాంగ్రెస్ మేనిఫెస్టో అమలు చేయాలి
* ఎం ఆర్ పి ఎస్, ఎం ఎస్ ఎఫ్ డిమాండ్
ఆకేరు న్యూస్,ములుగు: కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం వికలాంగులకు 6వేలు, వృద్దులు, వితంతువులు 4 వేలు పెన్షన్ ఇవ్వాలని ఎం ఆర్ పి ఎస్ రాష్ట్ర నాయకులు, ములుగు జిల్లా ఇన్చార్జి తడుగుల విజయ్, ఎం ఎస్ పి ములుగు జిల్లా అధ్యక్షులు మడి పెల్లి శ్యామ్ బాబు మాదిగ లు డిమాండ్ చేశారు. ములుగు జిల్లా కేంద్రంలోని రిటైర్డ్ ఉద్యోగుల కార్యాలయంలో వి హెచ్ పి ఎస్ ములుగు జిల్లా అత్యవసర ఈ సమావేశానికి వి హెచ్ పి ఎస్ రాష్ట్ర నాయకులు కోడారి సాంబయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న విజయ్ మాదిగ, మడి పెల్లి శ్యామ్ బాబు మాదిగలు మాట్లాడాతు వికలాంగుల, చేయూత పెన్షన్ దారుల విషయంలో ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తుందని, ఎన్నికల ముందు వికలాంగులకు పెన్షన్ పెంచుతామని చెప్పి అధికారంలోకి వచ్చిన తరువాత పట్టించుకోవడం లేదన్నారు. వికలాంగులను, ఆసరా పెన్షన్ దారులను ఏకం చేసి ఆగస్టు 13న ఎల్బి స్టేడియంలో లక్షలాది మందితో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు, తెలిపారు ఈ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో కన్నాయి గూడెం మండల ఇన్చార్జి నెమలి నర్సయ్య మాదిగ, వి హెచ్ పి ఎస్ ములుగు జిల్లా కార్యదర్శి బొచ్చు శ్రీనివాస్, యాంపాటి శ్రీనివాస్ రెడ్డి, వి హెచ్ పి ఎస్ జిల్లా అధ్యక్షులు శంఖేజి సుజాత, అల్లపి రవి, చిగురు దేవేందర్, లక్ష్మి, పొన్నాల కౌసల్య, వెంకటేష్ మాదిగ, సమావేశంలో వికలాంగులకు మద్దతుగా నేస్తం ఫౌండేషన్ వ్యవస్థాపకులు నక్క రాజు పాల్గొన్నారు.
………………………………….