* బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీ
* రేపు ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలపై కేసీఆర్ దిశానిర్దేశం
ఆకేరున్యూస్, హైదరాబాద్: నేడు బీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరగనుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేసీఆర్ సమావేశమై రేపు ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసంలో ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఏడాదిగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ప్రజావ్యతిరేక విధానాలు, ఆయా వర్గాల ప్రజలు పడుతున్న ఇబ్బందులను అసెంబ్లీ వేదికగా ఎత్తిచూపేందుకు ప్రజాప్రతినిధులకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలపై ప్రజల ఎదురుచూపు, నిరసన వంటి అంశాలపై కేసీఆర్ మార్గనిర్దేశం చేసే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
…………………………………