ఆకేరు న్యూస్, హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజే.. వాతావరణం వాడివేడిగా మారింది. అసెంబ్లీ ఆవరణలో (Assembly Session) ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు(BRS MLAS), ఎమ్మెల్సీలను భద్రతా సిబ్బంది అసెంబ్లీ గేటు అడ్డుకున్నారు. కేటీఆర్, హరీశ్ రావు సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అదానీ, రేవంత్ రెడ్డి (REVANTHREDDY)ఫొటోతో కూడిన టీ షర్ట్స్ ధరించడం వివాదానికి కారణమైంది. దీనిపై సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేశారు. అడ్డుకోవడంపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. అదానీ, రేవంత్ దోస్తానాపై నిరసన తెలుపుతున్నారు. రేవంత్ అదానీ (REVANTH – ADHANI)భాయి భాయి అంటూ నినాదాలు చేస్తున్నారు. ఢిల్లీలో కుస్తీ.. గల్లీలో దోస్తీ, తెలంగాణ తల్లి మాది.. కాంగ్రెస్ తల్లి నీది, బతుకమ్మను తీసి చేయి గుర్తు పెట్టిందంటూ పెద్దపెట్టున నినాదాలు చేస్తున్నారు. ఈనేపథ్యంలో భద్రతా సిబ్బందికి, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది.
………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
