Balakrishna Dada Movie release date
* బాలయ్య కొత్త సినిమా టైటిల్
* గోపీచంద్ మలినేని దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్
* డిసెంబర్ 24న విడుదల
ఆకేరు న్యూస్, హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ, బ్లాక్‌బస్టర్ దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కుతున్న స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్కు ‘దాదా’ అనే పవర్ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘ఎంట్రీ ఆఫ్ యాన్ ఎరా’ పేరుతో విడుదలైన గ్లింప్స్ ఇప్పటికే భారీ బజ్‌ను క్రియేట్ చేసింది.
* మాస్ అవతార్‌లో బాలయ్య
టైటిల్ పోస్టర్లో బాలకృష్ణ మాస్ అవతార్‌లో కనిపించారు. సన్‌గ్లాసెస్, లెదర్ జాకెట్, మెడలో భారీ గోల్డ్ చైన్‌తో స్టైలిష్‌గా కనిపించిన బాలయ్య.. భుజంపై వెపన్తో రౌడీ, గ్యాంగ్‌స్టర్ తరహా వైబ్‌ను తీసుకొచ్చారు. ఆయన సీరియస్ ఎక్స్ప్రెషన్, కమాండింగ్ బాడీ లాంగ్వేజ్ పాత్రలోని పవర్‌ను మరింత ఎలివేట్ చేస్తున్నాయి.
‘దాదా’ టైటిల్ గ్లింప్స్ బాలకృష్ణ పాత్ర ఆరాను హైలైట్ చేస్తూ సాగుతుంది. వాయిస్‌ఓవర్‌లో ఆయనను ‘షేర్’గా సంబోధిస్తూ వీడియో ప్రారంభమవుతుంది. పోలీస్ అధికారులు బాలయ్యను చుట్టుముట్టి ఛాతిలో కాల్చేస్తామని హెచ్చరిస్తారు. దీనికి బాలకృష్ణ చెప్పే పవర్ఫుల్ డైలాగ్ అభిమానులను ఆకట్టుకునేలా ఉంది. “నాకు గురి పెట్టడానికి ఒంట్లో పొగరు వేలికి ట్రిగ్గర్ ఉంటే సరిపోదు.. బుల్లెట్స్‌కి బలుపు, గన్స్‌కి గట్స్ ఉండాలి” అంటూ ఆయన చెప్పే డైలాగ్ మాస్ ఆడియన్స్‌ను అలరించేలా ఉంది.
* క్రిస్మస్కు ముందస్తు న్యూ ఇయర్ ట్రీట్
‘దాదా’ డిసెంబర్ 24న థియేటర్లలోకి రానుంది. క్రిస్మస్తో పాటు ముందస్తు న్యూ ఇయర్ ట్రీట్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
మంచు మనోజ్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి అరవింద్ ఎస్. కశ్యప్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎస్. థమన్ సంగీతం, ఏఎస్. ప్రకాశ్ ప్రొడక్షన్ డిజైన్, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు. రామ్-లక్ష్మణ్, రవి వర్మ, వెంకట్ యాక్షన్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
