* పురుగుల మందు తాగి ఆత్మహత్య
* మంచిర్యాలలో విషాదం
* ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి..
ఆకేరున్యూస్, మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. అప్పుల బాధతో ఓ కుటుంబం పురుగుల మందు తాగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన మంగళవారం జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంచిర్యాల జిల్లా తాండూరు మండలం కాసిపేటలో మొండయ్య (55) అనే రైతు అప్పుల బాధతో భార్య శ్రీదేవి (50), కూతురు చైతన్య (22), కొడుకుతో కలిసి పురుగుల మందు తాగగా.. పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. కొడుకు చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలుముకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందడంతో పలువురు కన్నీటి పర్యంతయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
