Telangana Fertilizers, Pesticides and Seeds Dealers Welfare Association president Nagurla Venkateshwarlu
* అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నాగుర్ల వెంకటేశ్వర్లు
ఆకేరు న్యూస్, హనుమకొండ : రైతులకు అవసరమైన ఎరువులు,పురుగుమందులు, విత్తనాల విక్రయాలపై ఆధారపడి వ్యాపారం నిర్వహిస్తున్న డీలర్లకు (UPI Charges ) యూపీఐ లావాదేవీలకు సంబంధించిన చార్జీల నుంచి మినహాయింపు కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్, డీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నాగుర్ల వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని కోరారు.
ప్రస్తుతం డిజిటల్ చెల్లింపుల వినియోగం రోజురోజుకూ పెరుగుతోందని,వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోళ్లలోనూ రైతులు యూపీఐ ద్వారా చెల్లింపులు చేస్తున్నారని ఆయన తెలిపారు. ముఖ్యంగా ఎరువులు,పురుగుమందులు, విత్తనాల విక్రయాల్లో డిజిటల్ లావాదేవీలు పెరుగుతున్న నేపథ్యంలో డీలర్లపై అదనపు లావాదేవీ వ్యయాలు పడకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
రైతులకు అవసరమైన వ్యవసాయ ఇన్‌పుట్స్‌ను సకాలంలో అందించడంలో డీలర్లు కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన వ్యాపార లావాదేవీలను ప్రోత్సహించే విధంగా ఎరువులు,పురుగుమందులు, విత్తనాల విక్రయాలకు సంబంధించిన యూపీఐ చెల్లింపులపై (UPI Charges) డీలర్లకు ప్రత్యేక మినహాయింపు లేదా రాయితీ విధానం అమలు చేయాలని కోరారు.
డీలర్ల సమస్యలను ప్రభుత్వం పరిశీలించి,బ్యాంకులు, డిజిటల్ చెల్లింపు సంస్థలతో సమన్వయం చేసుకుని తగిన నిర్ణయం తీసుకోవాలని నాగుర్ల వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు.రైతులకు నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులను అందించడంతో పాటు డీలర్లపై అనవసరమైన అదనపు ఆర్థిక భారం పడకుండా చూడాలని ఆయన కోరారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
