ACB Raid
* తహసీల్దార్ అదుపులోకి
ఆకేరు న్యూస్, ములుగు : ములుగు జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు (ACB Raid) చర్యలు చేపట్టినట్లు సమాచారం. గోవిందరావుపేట తహసీల్దార్ సృజన్ కుమార్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
తండ్రి, కొడుకుల మధ్య ఉన్న భూ వివాదాన్ని పరిష్కరించేందుకు రూ.14 వేల లంచం డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై అందిన ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు చర్యలు చేపట్టినట్లు సమాచారం.
లంచం డిమాండ్‌కు సంబంధించిన వ్యవహారంలో తహసీల్దార్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే ఏసీబీ ( ACB Raid) అధికారులు అధికారికంగా వెల్లడించే వివరాలు రావాల్సి ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
