* పాఠశాలలు, కళాశాలలకు సెలవు
* తిరుపతిలోనూ వీధులు జలమయం
* పాపవినాసనం, శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలు మూసివేత
ఆకేరు న్యూస్, డెస్క్ : తమిళనాడు (Tamilanadu) రాష్ట్రాన్ని భారీ వర్షాలు ముంచేస్తున్నాయి. దీంతో అధికార యంత్రాంగం అంతా సహాయక చర్యల్లో నిమగ్నమై ఉంది. రానున్న రెండు రోజులపాటు చెన్నై(Chennai)తోపాటు విల్లుపురం, తంజావూరు, మైలదుత్తురై, పుదుక్కోట్టై, కడలూరు, దిండిగల్, రామనాథపురం, తిరువారూర్, రాణిపేట్, తిరువళ్లూరు జిల్లాల్లో వర్షాలు పడతాయని ఐఎండీ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేయడం తో అధికారులు మరింత అప్రమత్తం అయ్యారు. దీంతో గురువారం ఈ జిల్లాల్లో పాఠశాలలకు, కళాశాలలకు తమిళనాడు ప్రభుత్వం (Tamilanadu Government) సెలవు ప్రకటించింది. చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, విళ్లుపురం, కళ్లకురిచ్చి, రామనాథపురం, అరియలూరు, కడలూరు, కరైక్కల్, తిరుచ్చి, నాగపట్టణం, కోయంబత్తూర్ సహా తదితర జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. తమిళనాడుకు సమీపంలోని తిరుపతిలోనూ పలు వీధులు జలమయం అయ్యయి. కపిల తీర్థం పుష్కరిణిక వెళ్లకుండా టీటీడీ నిలిపివేసింది. పాపవినాసనం, శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలను తాత్కాలికంగా మూసివేసింది.
……………………………