* 57 గంటలపాటు శ్రమించినా దక్కని ప్రాణం
ఆకేరు న్యూస్ డెస్క్ : రాజస్థాన్(Rajasthan)లో ఓ బాలుడి రెస్క్యూ ఆపరేషన్ విషాదాంతంగా ముగిసింది. దాదాపు 57 గంటల పాటు శ్రమించి బోరుబావిలో పడిన బాలుడిని బయటకు తీసినా.. అప్పటికే బాలుడు మృతి చెంది ఉన్నాడు. రాజస్థాన్ దౌసా జిల్లాలోని కలిఖడ్ గ్రామంలో బాలుడు ఆర్యన్ (5) సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇంటి పక్కనే ఉన్న 175 అడుగుల లోతున్న బోరుబావిలో పడిపోయాడు. కుటుంబసభ్యులు హుటాహుటిన అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకు సహాయకచర్యలు ప్రారంభించారు.
ఎన్డీఆర్ఎఫ్(Ndrf) బృందాలు అల్యూమినియంతో తయారు చేసిన హుక్ ద్వారా బాలుడిని బయటకు తీయడానికి విఫలయత్నం చేశారు. అది ఫలించకపోవడంతో బోరుబావికి కొంత దూరంలో 4 అడుగుల వెడల్పుతో గుంత తీశారు. దాదాపు 57 గంటల శ్రమ అనంతరం 150 అగుడుల మేర తవ్వకం పూర్తయిన తర్వాత అందులోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది.. సొరంగం తవ్వి బాలుడిని కాపాడారు. అప్పటికే అతడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో గ్రీన్ చానల్(Green channel) ఏర్పాటుచేసి అంబులెన్సులో దవాఖానకు తరలించారు. అయితే అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో బాలుడి కోసం ఎంతో తపనపడిన ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు.
………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
