* 12 మంది మావోయిస్టులు మృతి
ఆకేరున్యూస్, ఛత్తీస్‌గఢ్: ఛత్తీస్‌గఢ్‌లోని అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతిచెందారు. దంతేవాడ, నారాయణపూర్ సరిహద్దుల్లోని దక్షిణ అబూజ్మడ్ అడవుల్లో భద్రతా సిబ్బంది మావోయిస్టుల కోసం గాలింపు చేపట్టగా.. పోలీసులకు ఎదురుపడిన మావోయిస్టులు కాల్పులకు పాల్పడ్డారు. ప్రతిగా భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో మావోయిస్టులు మరణించారు. గురువారం ఉదయం 3 గంటల నుంచి ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని పోలీసులు వెల్లడిరచారు. కూంబింగ్‌లో నారాయణపూర్, దంతెవాడ, జగదల్పూర్, కొండగాల్ జిల్లా భద్రతా బలగాలతోపాటు డీఆర్జీ, ఎస్టీఎఫ్, సీఆర్పీఎఫ్ బలగాలు పాల్గొన్నాయి.
………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
