Kamalapur
Published:
Kamalapur: ఆకేరు న్యూస్, కమలాపూర్: కమలాపూర్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఈ నెల 19న ఉదయం 11 గంటలకు మండల స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో గుండెబాబు తెలిపారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాల మేరకు ప్రతి 45 రోజులకు ఒకసారి ఈ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
సమావేశానికి గ్రామ పంచాయతీ సర్పంచులు, మండల స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. ప్రభుత్వ పథకాల అమలు, గ్రామ పంచాయతీల అభివృద్ధి, సర్పంచుల బాధ్యతలు, ప్రజా సమస్యల పరిష్కారం తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు.
ఈ వార్తకు సంబంధించిన బృందం

Reporter
Senior Journalist Team
దేశ వ్యాప్తంగా సీనియర్ జర్నలిస్ట్ లతో కూడిన టీం నెట్వర్క్
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
