Gabbeta
Published:
Gabbeta: ఆకేరు న్యూస్, జనగామ: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం గబ్బెట గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు కుమారులు మృతి చెందడంతో తీవ్ర మనస్తాపానికి గురైన వృద్ధ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.
గ్రామానికి చెందిన గైని లక్ష్మి (86), గైని పుల్లయ్య (91) దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ముగ్గురు కుమారులు ఉన్నారు. అయితే ముగ్గురు కుమారులు వివిధ కారణాలతో మృతి చెందారు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన దంపతులు పురుగుల మందు తాగినట్లు పోలీసులు తెలిపారు.
కుటుంబ సభ్యులు గమనించి ఆస్పత్రికి తరలించేలోపే ఇద్దరూ మృతి చెందినట్లు సమాచారం. ఘటనపై రఘునాథపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తకు సంబంధించిన బృందం

Reporter
Senior Journalist Team
దేశ వ్యాప్తంగా సీనియర్ జర్నలిస్ట్ లతో కూడిన టీం నెట్వర్క్
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
