- ఆపరేషన్ గరుడ సక్సెస్ ..
- బ్రెజిల్ నుంచి సరఫరా అవుతున్న డ్రగ్స్
- ఇంటర్ పోల్ సమాచారంతో డ్రగ్స్ గుట్టు ఛేదించిన సీబీఐ
ఆకేరు న్యూస్ , హైదరాబాద్ : ఆపరేషన్ గరుడ ( Operation Garuda ) విజయవంతమైంది. గతంలో ఎన్నడూ లేని విదంగా భారీ ఎత్తున 25000 కిలోల డ్రగ్స్ ( Drugs ) ను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బ్రెజిల్ ( Brazil) నుంచి ఒక ఎక్స్ పోర్ట్ సంస్థ అడ్రస్ తో కంటైనర్ విశాఖకు చేరుకున్నది. ఇంటర్ పోల్ ( Inter pole ) అధికారుల సమాచారంతో అప్రమత్తమైన సీబీఐ ( CBI ) రంగంలోకి దిగింది. ఈ నెల 16న విశాఖ పట్నానికి చేరుకున్నప్పటికీ నార్కోటిక్స్, కస్టమ్స్ అధికారులతో కలిసి రహస్య ఆపరేషన్ ద్వారా నిర్ధారించుకున్నారు. గురువారం ఒక్క సారిగా సర్ప్రైజ్ అటాక్ చేసి డ్రగ్స్ కంటైనర్ ను స్వాధీనం చేసుకున్నారు. తెరిచి చూసిన అధికారులు నిర్ఘాంత పోయారు. ఏకంగా 25వేల కిలోల డ్రగ్స్ 1000 బ్యాగుల్లో ఉన్నాయి. నార్కోటిక్స్ డ్రగ్స్ డ్రై ఈస్ట్ ( Narcotics Drugs ) (Dry Yeast ) తో కలిపి ప్యాక్ చేసి ఉన్నాయి. బ్రెజిల్ శాంటోస్ పోర్ట్ నుంచి విశాఖ పట్నంలోని ప్రముఖ ఎక్స్ పోర్ట్ కంపెనీ అడ్రస్ తో పంపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.ఈ మేరకు సీబీఐ ఢిల్లీ కార్యాలయం పత్రికా ప్రకటన విడుదల చేసింది. ఈడ్రగ్స్ విలువ ఏకంగా 50 వేల కోట్ల విలువ ఉంటుందన్నది అనధికార అంచనా. ఎవరీ అడ్రస్ తో చేరిందన్నది మాత్రం ఇప్పటి వరకు సీబీఐ అధికారులు పూర్తి వివరాలు వెల్లడించలేదు. రాజకీయ ప్రముఖలకు సంబందించిన సంస్థ అయితే ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ పెద్ద ఎత్తున కలకలం రేగే అవకాశం ఉంది.
- షాకింగ్ విషయం ఇదీ..
- నారా చంద్రబాబు నాయుడు ( Chandrababu Nayudu)
నిజంగా ఇదీ షాకింగ్ విషయం. 25000 వేల కిలోల డ్రగ్స్ పట్టుపడ్డాయన్న వార్త కలవరానికి గురి చేస్తోంది.
అంతర్జాతీయ ఖ్యాతి ఉన్న విశాఖ పట్నం డ్రగ్స్ కేపిటల్ గా మారిపోతుంది. యువత భవిష్యత్తు ప్రమాదంలో పడింది. డ్రగ్స్ మూలాలు ఎక్కడ ఉన్నప్పటికీ పరిశోధించి శిక్షించాల్సిన అవసరం ఉంది.
- ఆంధప్రదేశ్‌కు రాజధాని లేదు కాని డ్రగ్స్‌కు రాజధాని చేశారు.
జనసేన నేత పవన్ కళ్యాణ్ ( Pavan Kalyan )
- జగన్ నాయకత్వంలో కొనసాగుతున్న వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేకుండా చేశారు. మాదక ద్రవ్యాలకు మాత్రం రాజధానిగా మార్చారు. ఎక్కడ గంజాయి పట్టుబడినప్పటికీ మూలాలు మన రాష్ట్రంలోనే ఉండడం సిగ్గు చేటైన విషయం . ఇలాంటి తరుణంలోనే విశాఖలో 25000 కిలోల డ్రగ్స్ పట్టుబడినాయన్న వార్త ఆందోళన కలిగిస్తోంది. దీని వెనుక ఎవరున్నారో వెంటనే తేల్చాల్సిన అవసరం ఉందని పవన్‌కళ్యాణ్ డిమాండ్ చేశారు.
- ———————-