* లేఖలో ఆసక్తికర అంశాలు
ఆకేరు న్యూస్ సినిమా డెస్క్ : మంచు మనోజ్ తల్లి తాజాగా పోలీసులకు రాసిన లేఖ సంచలనంగా మారింది. ఆ లెటర్ లో మంచు మనోజ్ కి వ్యతిరేకంగా కొన్ని అంశాలను తల్లి ప్రస్తావించడం సంచలనంగా మారింది. పోలీసులకు విడుదల చేసిన లెటర్ లో మనోజ్ తల్లి ఏమన్నారంటే.. “నేను మోహన్ బాబు భార్య మంచు నిర్మలా మోహన్ బాబు. జల్ పల్లిలోని మంచు టౌన్ లో ఉంటున్నాను. డిసెంబరు 14వ తేదీన నా పుట్టినరోజు సందర్భంగా నా పెద్ద కుమారుడు అయిన విష్ణు మంచు జల్ పల్లి ఇంటికి వచ్చి కేకు తీసుకొచ్చి సెలబ్రేట్ చేసాడు. దీనికి నా చిన్న కుమారుడైన మనోజ్.. ఇంటికి వచ్చిన విష్ణు ఫుటేజ్‌ని బయట పెట్టి, దాన్ని విష్ణు గొడవ చేసినట్టు లేనిపోని అభాండాలు వేసి పోలీస్ కంప్లయింట్ ఇచ్చినట్టు తెలిసింది. నేను చెప్పదలచుకున్నది ఏమిటంటే, నా పుట్టినరోజు సందర్భంగా విష్ణు కేక్ తీసుకుని ఇంటికి వచ్చాడు. అలాగే తన రూములో ఉన్న సామాను తీసుకున్నాడు.
ఉన్న కొద్దిసేపు నాతోటి ఉండి కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేసాడు, నా చిన్న కొడుకైన మనోజ్ కి ఈ ఇంట్లో ఎంత హక్కు ఉందో, అలాగే నా పెద్ద కొడుకు అయిన విష్ణుకి కూడా అంతే హక్కు ఉంది. నా పెద్ద కొడుకు అయిన విష్ణు ఎటువంటి దౌర్జన్యంతో కానీ, మనుషులతో కానీ ఇంట్లోకి రాలేదు, గొడవ చేయలేదు. మనోజ్ కంప్లయింట్ చేసిన దానిలో నిజం లేదు. ఈ ఇంట్లో పని చేసే వాళ్ళు కూడా మేమిక్కడ పని చేయలేమని వాళ్ళే మానేసారు. ఇందులో విష్ణు ప్రమేయం ఎంతమాత్రం లేదు. విష్ణు మా జల్పల్లి ఇంటికి వచ్చాడు, నా పుట్టిన రోజు సెలబ్రేట్ చేశాడు, విష్ణు గదిలో వున్న తన సామాను తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు, అంతకు మించి ఇక్కడ జరిగింది ఏమీ లేదు మీకు తెలియచేస్తున్నాను” అని లేఖలో పేర్కొన్నారు.
………………………………………