* మండలి రేపటికి వాయిదా
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : లగచర్ల ఘటనపై అటు శాసనసభ, ఇటు శాసనమండలి హోరెత్తుతున్నాయి. రైతుల పట్ల ప్రభుత్వ తీరుపై చర్చ జరగాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్ ఈ అంశంపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది. లగచర్ల ఘటనపై శాసన మండలిలో చర్చకు బీఆర్ఎస్ సభ్యులు పట్టుబట్టారు. కానీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.. సభ్యుల ఆందోళనల మధ్య రేపటికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. లగచర్ల రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. లగచర్ల రైతులను వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు. ఇదేమీ రాజ్యం.. ఇదేమీ రాజ్యం.. దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఇక కౌన్సిల్ నుంచి బయటకు వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు.. మండలి ఆవరణలో తమ నిరసనను కొనసాగించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
