* రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
* యువ వైధ్యులు రాష్ట్రపతిని ఆదర్శంగా తీసుకోవాలి
* సీఎం చంద్రబాబునాయుడు
ఆకేరున్యూస్, అమరావతి : ప్రతి డాక్టర్ సేవకే ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యువ వైద్యులకు పిలుపునిచ్చారు. మంగళగిరి ఎయిమ్స్ మొదటి స్నాతకోత్సవం సందర్భంగా ఎంబీబీఎస్ విద్యార్థులకు రాష్ట్రపతి పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్రపతి మాట్లాడుతూ ప్రతి రోగికి వైద్య సేవలు అందించాలని, ఆయుష్మాన్ భారత్ ద్వారా దేశ ప్రజలకు ఆరోగ్య సేవలు తేలిగ్గా అందించడమే ధ్యేయంగా ఉండాలని కోరారు. ప్రతి ఒక్కరూ పూర్తి ఆరోగ్యంపై దృష్టి సారించాలని, ప్రాణాపాయాలు, యోగాసనాలు చేయాలన్నారు. ప్రపంచ పటంలో భారతదేశం మెడికల్ సేవలలో అందుబాటులో ఉండే దేశంగా నిలవటానికి డాక్టర్ల సేవలు మరువలేనివవన్నారు. అనంతరం సీఎం చంద్రబాబునాయుడు మాట్లాడుతూ యువ వైధ్యులు రాష్ట్రపతిని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. మెడికల్ అనేది ఇప్పుడు మెడ్టెక్గా మారిపోయిందని అన్నారు. మంగళగిరికి 10 ఎకరాలు ఇస్తామని, అవకాశముంటే తనకు ఇక్కడ చదువుకోవాలని ఉందని పేర్కొన్నారు. కొలనుకొండలో రీసెర్చ్ సెంటర్, ఐఐటీతో అనుసంధానించాలని భావిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు ఆయూష్, ప్రకాష్‌రావు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రులు నారా లోకేష్, సత్యకుమార్ తదితరులు పాల్గొన్నారు.
………………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
