ఆకేరున్యూస్, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి ఆకుపచ్చ కండువాలతో హాజరయ్యారు. రైతు సమస్యలపై మండలి, శాసన సభలో చర్చించాలంటూ బీఆర్ఎస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. రాష్ట్రంలో రైతులకు పంట పెట్టుబడి సహాయం అందక, రుణమాఫీ కాక, అన్ని పంటలకు బోనస్ రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అందువల్ల ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతులకు ఈ యాసంగికి వానాకాలంతో కలిపి ఎకరాకు రూ.15 వేల చొప్పున పెట్టుబడి సహాయం అందించాలని డిమాండ్ చేశారు. రూ.2 లక్షల వరకు రైతులందరికి రుణమాఫీ చేయాలని, అన్ని పంటలకు వెంటనే బోనస్ చెల్లించాలని కోరారు. ఈ నేపథ్యంలో రైతులకు మద్దతుగా శాసన మండలి సభ్యులు, ఎమ్మెల్యేలు ఆకుపచ్చ కండువాలతో సమావేశాలకు హాజరయ్యారు.
………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
