* ఫార్ములా-ఈ కార్ రేసింగ్‌పై ఏసీబీ కేసు
* ఏ1గా కేటీఆర్
ఆకేరున్యూస్, హైదరాబాద్: ఫార్ములా-ఈ కార్ రేసింగ్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఏ1గా, ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్‌ను ఏ2గా, ఏ3గా హెచ్ఎండీఏ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్. 13(1)ఏ, 13(2)యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. 409, 120బీ సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. 4 సెక్షన్లు నాన్ బెయిలబుల్ కేసులే కావడం గమనార్హం. ఓ ప్రయివేటు కంపెనీ సీఈవో బీఎల్ఎన్ రెడ్డిని కూడా నిందితుల జాబితాలో చేర్చారు ఏసీబీ అధికారులు. కేటీఆర్‌పై విచారణ జరిపేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇటీవల అనుమతించిన సంగతి తెలిసిందే. గవర్నర్ అనుమతితో తదుపరి చర్యలకు కాంగ్రెస్ సర్కార్ ఉపక్రమించింది.
……………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
