* మైలార్దేవ్ పల్లిలో డెడ్ బాడీ కలకలం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఆ పారిశుధ్య కార్మికులు రోజూలాగే.. ఉదయం రోడ్లను శుభ్రం చేస్తున్నారు. ఇంతలో రోడ్డుపక్కన ఉన్న చిన్న కాలవలో ఓ గోనెసంచి అనుమానాస్పదంగా కనిపించింది. అందులో ఏముందా.. అని కొందరు తెరిచి చూశారు.. అంతే ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అందులో డెడ్‌బాడీ(Deadbody) కనిపించడంతో భయాందోళనకు గురయ్యారు.
వెంటనే డయల్ 100(dial 100)కు ఫోన్ చేసి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని డెడ్‌బాడీని స్వాధీనం చేసుకున్నారు. ఎవరో హత్య చేసి గోనెసంచిలో కట్టి పడేసినట్లు తెలుస్తోంది. ఎక్కడో చంపి సంచిలో మూటగట్టి మైలార్‌దేవ్‌పల్లి (Milordevpalli) దుర్గానగర్ నగర్లో దుండగులు పడేసినట్లు భావిస్తున్నారు. చనిపోయిన వ్యక్తి ఎవరు.. ఎవరు చంపారు.. ఎందుకు చంపారు.. అనే విషయాలను ఆరా తీస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపడుతున్నారు.
………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
