ఆకేరున్యూస్, న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంతిమయాత్ర ప్రారంభమైంది. ఢల్లీిలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం నుంచి ఈ యాత్ర మొదలైంది. నిగంబోథ్ ఘాట్ వరకూ యాత్ర కొనసాగనుంది. ఉదయం 11.45 గంటలకు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మన్మోహన్ సింగ్ గురువారం మృతిచెందిన విషయం తెలిసిందే. శుక్రవారం ఆయన నివాసంలో మాజీ ప్రధానికి పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులర్పించారు. కాగా, ఇవాళ ఉదయం ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి మన్మోహన్ భౌతికకాయాన్ని తీసుకురాగా.. పార్టీ నేతలు, కార్యకర్తలు అక్కడ నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా పలువురు నేతలు మన్మోహన్ పార్థివదేహం వద్ద అంజలి ఘటించారు.
………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
