ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మరి కొద్ది గంటల్లో న్యూ ఇయర్ వేడుకలకు (New Year Celebrations) నగరం సిద్ధమవుతోంది. వేడుకల నిర్వహణలో ఈసారి సరికొత్త ట్రెండ్ కనిపిస్తోంది. ఇండివిడ్యువల్ పార్టీలతో పాటు.. గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్ మెంట్లో కలిసికట్టుగా వేడుక జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. ప్రమోషన్ లో భాగంగా కొన్ని వాణిజ్య సంస్థలు ముందుకు వచ్చి.., అపార్టమెంట్ వాసులకు విందు, వినోదం ఏర్పాటు చేస్తున్నాయి. మరికొందరు సామూహికంగా రిసార్టులు బుక్ చేసుకుని సెలబ్రేషన్స్ నగర శివారుల్లో ప్లాన్ చేసుకున్నారు. ఈమేరకు సాయంత్రం బస్సుల్లో వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు.. పబ్బులు, క్లబ్బుల్లోనూ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. డీజే(Dj)లతో మోత మోగించనున్నారు. అయితే.. వేడుకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. 45 డెసిబిల్స్ కు మించి సౌండ్ మించితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఒంటి గంటకే మూసివేయాలని హెచ్చరించారు.
అటువైపు వెళ్లకండి..
కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా అతి వేగంతో వాహనాలు వెళ్లే అన్ని ఫ్లై ఓవర్లనూ మూసివేయనున్నారు. డిసెంబర్ 31 రాత్రి 11 గంటల నుంచి 2025 జనవరి 1 తెల్లవారుజామున 5 గంటల వరకు ఔటర్ రింగ్ రోడ్డు (ORR)పై కార్లు, ప్యాసింజర్ వాహనాలు వెళ్లేందుకు అనుమతి లేదు. ఎయిర్పోర్టు(Airport)కి వెళ్లే వాహనాలను కూడా పోలీసులు ఆపుతారు. అప్పుడు ఫ్లైట్ టికెట్ చూపించాలి. అప్పుడు ఆ వాహనాలను అనుమతిస్తారు. తనిఖీల నేపథ్యంలో విమాన ప్రయాణం ఉన్నవారు కొంచెం ముందుగానే బయలుదేరేలా ప్లాన్ చేసుకుంటే బెటర్. ఎల్బీ నగర్ ఎక్స్ రోడ్డులో మల్టీ లెవల్ ఫ్లైఓవర్, ఎల్బీనగర్ అండర్ పాస్, నాగోల్ ప్లె ఓవర్, కామినేని ప్లై ఓవర్, సాగర్ రింగ్ రోడ్డు వెళ్లే బైరామల్ గూడ క్రాస్ రోడ్, చింతల కుంట అండర్ పాస్ లోని మొదటి, రెండో లెవెల్ ప్లె ఓవర్. ఈ ఫ్లైఓవర్లపై టూవీలర్, ప్యాసింజర్, లైట్ మోటార్ వాహనాలకు అనుమతి లేదు.
ఎటువెళ్లినా డ్రంకెన్ డ్రైవ్ అండ్ డ్రగ్ టెస్టులు
కొంచెం ఎక్కువే తాగండి.. న్యూ ఇయర్ పార్టీ ఎంజాయ్ చేయండి.. అంటూ ప్రభుత్వం ఈరోజు అర్ధరాత్రి 12 గంటల వరకూ మద్యం దుకాణాలకు అనుమతి ఇచ్చింది. బార్లు రెస్టారెంట్లను అర్థరాత్రి 1 గంట వరకూ తెరచి ఉండొచ్చని తెలిపింది. అలాగని.. అతిగా తాగి డ్రైవింగ్ చేస్తే ఊచలు లెకించకతప్పదు. పోలీసులు ఎక్కడికక్కడ డ్రంకెన్ డ్రైవ్ టెస్టులకు(Drunken Drive Tests) సిద్ధమవుతున్నారు. అలాగే.. డ్రగ్ టెస్ట్ లు కూడా చేయనున్నారు. ఈ మేరకు అదనంగా ప్రత్యేక కిట్లను సిద్ధంగా ఉంచినట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.
……………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
