Palakurthi Pulse Polio Programme
ఆకేరు న్యూస్, పాలకుర్తి: పోలియో రహిత సమాజమే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పని చేయాలని పాలకుర్తి మేజర్ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ గాదె కిరణ్ పిలుపునిచ్చారు. పాలకుర్తి మండల కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని గ్రామపంచాయితీ వార్డు సభ్యులతో కలిసి ఆదివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఐదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి, వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. గ్రామంలోని పిల్లలకు ఈ సేవలు అందేలా ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు కత్తి దస్తగిరి మామిండ్ల, కవిత శోభన్ బాబు, కమ్మగాని.సుధాకర్ గౌడ్, కమ్మగాని.శ్రీకాంత్ గౌడ్, ఏఎన్ఎం స్రవంతి, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
