ఆకేరు న్యూస్, సూర్యాపేట : నూతన సంవత్సరం తొలిరోజే సూర్యాపేట జిల్లా(Suryapet District)లో విషాదం చోటుచేసుకుంది. పార్టీ చేసుకుందామని పిలిచి ఒకరిని దారుణంగా చంపేశారు. జిల్లాలోని చివ్వెంల మండలం లక్ష్మి తండాకు చెందిన ధరావత్ శేషు(39)కు, అదే తండాకు చెందిన తన ప్రత్యర్థులతో కొంత కాలంగా భూ విషయంలో వివాదాలు నడుస్తున్నాయి. నిన్న రాత్రి న్యూఇయర్ పార్టీ (New Year Party) చేసుకుందామని ప్రత్యర్థులు శేషును ఆహ్వానించారు. ఈ సంవత్సరం నుంచి అన్నీ మరచిపోయి వివాదాలు పరష్కరించుకుందామని చెప్పారు. నమ్మి వెళ్లిన శేషును కత్తితో గొంతు కోసి దారుణంగా చంపేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
……………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
