Viswanath and Sons OTT Release date announced
* ఎక్కడ చూడాలంటే..
* స్ట్రీమింగ్ తేదీని ప్రకటించిన నెట్‌ఫ్లిక్స్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ :
సూర్య, మమితా బైజు జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. బాక్సాఫీస్ వద్ద కూడా విజయవంతంగా దూసుకెళ్లిన ఈ చిత్రం.. సూర్య కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో రెండో స్థానంలో నిలిచింది. అంతేకాకుండా 2026లో అత్యధిక వసూళ్లు సాధించిన తమిళ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.
* ఎక్కడ చూడొచ్చంటే..
‘విశ్వనాథ్ అండ్ సన్స్’ చిత్రం సెప్టెంబర్ 11 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించింది.‘‘సంజయ్ విశ్వనాథ్‌ను కలుసుకోండి. అథ్లెట్.. బిలియనీర్.. దాత, ప్రేమగల తండ్రి’’ అంటూ నెట్‌ఫ్లిక్స్ సినిమా స్ట్రీమింగ్ తేదీని ప్రకటించింది. ఈ సినిమా తమిళం, హిందీ, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో అందుబాటులోకి రానుంది.
* ఈ చిత్రాలతో.. వెంకీ అట్లూరి గుర్తింపు
‘లక్కీ భాస్కర్’.. ‘వాతి’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి. సూర్య, మమితా బైజు ప్రధాన పాత్రల్లో నటించగా.. రాధికా శరత్‌కుమార్, రవీనా టాండన్ కీలక పాత్రల్లో నటించారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
