Telangana Police Jobs 2026
* దరఖాస్తు గడువు పొడిగింపు
* సెప్టెంబర్ 16 వరకు అవకాశం
* మొత్తం పోస్టులు 7,437
ఆకేరు న్యూస్, డెస్క్: తెలంగాణ పోలీసు ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలనుకుంటున్న అభ్యర్థులకు తెలంగాణ పోలీసు నియామక మండలి (TSLPRB) శుభవార్త తెలిపింది. వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి దరఖాస్తు గడువును పొడిగిస్తూ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. కొత్త షెడ్యూల్ ప్రకారం, అభ్యర్థులు సెప్టెంబర్ 16వ తేదీ సాయంత్రం 5:00 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.
మొత్తం 7,437 పోస్టుల భర్తీకి గానూ TSLPRB జులై 29న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థుల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ గడువును పెంచుతున్నట్లు నియామక మండలి పేర్కొంది. అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ (www.tslprb.in) ద్వారా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
Also Read :
Telangana Police Recruitment 2026 | 7,437 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

Please tell us what is wrong. Your report will be sent to the website team.
