* సౌకర్యాలపై ప్రయాణికులతో మంత్రి ఆరా
ఆకేరున్యూస్, హైదరాబాద్: సికింద్రాబాద్ జూబ్లీ బస్‌స్టేషన్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మిక తనిఖీ చేశారు. జేబీఎస్లో ప్రయాణికులతో మంత్రి పొన్నం ప్రభాకర్ ముచ్చటించారు. రోడ్డు భద్రతా మాసంలో భాగంగా డ్రైవర్లతో మాట్లాడి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. అలాగే క్యాంటీన్లో నాణ్యమైన ఆహారం అందించాలని సూచించారు. బస్ స్టేషన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని శానిటేషన్ సిబ్బందికి సూచించారు. బస్ స్టేషన్లో ఉన్న షాపులలో నాణ్యమైన ఆహార వస్తువులు ఉండాలని, కాలం చెల్లిన ఆహార వస్తువులు ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ వెంట జిల్లా కలెక్టర్ అనుదీప్ దురషెట్టి ఇతర అధికారులు ఉన్నారు.
……………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
