ఆకేరున్యూస్ డెస్క్: బీహార్, కేరళ రాష్ట్రాలకు కొత్తగా నియమితులైన గవర్నర్లు నేడు బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ కేరళ గవర్నర్గా బాధ్యతలు నిర్వర్తించిన ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్.. తాజాగా బీహార్ గవర్నర్గా ప్రమాణం చేశారు. అదేవిధంగా ఇన్ని రోజులూ బీహార్ గవర్నర్గా పనిచేసిన రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కేరళ గవర్నర్గా ప్రమాణం చేశారు. దేశంలోని ఐదు రాష్ట్రాలకు కేంద్రం గవర్నర్లను నియమించిన విషయం తెలిసిందే. బీహార్ గవర్నర్గా ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్, కేరళ గవర్నర్గా రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, ఒడిశా గవర్నర్గా కంభంపాటి హరిబాబు, మిజోరం గవర్నర్గా జనరల్ విజయ్ కుమార్ సింగ్, మణిపూర్ గవర్నర్గా కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాను నియమించింది.
…………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
